వృద్ధ ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్న పోలింగ్ అధికారి... చితగ్గొట్టిన స్థానికులు

  • సూర్యాపేట జిల్లా వెళ్లటూరు గ్రామంలో అక్రమార్కుడు
  • వృద్ధుల బదులు సొంతంగా ఓటు వేస్తున్న అధికారి
  • బుద్ధి చెప్పిన స్థానికులు
ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులు చెప్పినట్టు కాకుండా, సొంతంగా తనకు నచ్చిన పార్టీకి ఓటు వేస్తున్న పోలింగ్ అధికారిని స్థానికులు చితకబాదారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం వెళ్లటూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 139వ నంబర్ బూత్ లో ఉన్న ఆ అధికారి సొంతంగా ఓటు వేస్తున్నట్టు గుర్తించి, బుద్ధి చెప్పారు. ఓటు ఎలా వేయాలో చెబుతానని, వారి బదులు అధికారులే ఓటు వేస్తున్నారని పలుచోట్ల ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
Go Back to Shorts
polling officer
vote
senior citizens
Suryapet District

More Telugu News